Donald Trump: ఇరాన్ తరలించే అవకాశమే లేదు : ట్రంప్

అణుకేంద్రాలపై అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని, ఫోర్డ్ అణుకేంద్రం నుంచి అరవై శాతం శుద్ధి చేసిన 400 కిలోలో యురేనియం (Uranium) ను ఇరాన్ (Iran) సురక్షిత ప్రాంతానికి తరలించిందని వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఖండిరచారు. ఆ ప్రాంతంలో ఉన్న కార్లు (Cars), చిన్న పాటి ట్రక్కులు (Trucks) అక్కడి పరికరాలను కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తున్న కార్మికులవి. దాన్ని అక్కడినుంచి తీసుకెళ్లలేదు. అంత మొత్తాన్ని తరలించడం చాలా కష్టం. అందుకు చాలా సమయం పడుతుంది. ప్రమాదాకరం అని ట్రంప్ పేర్కొన్నారు.