Donald Trump: ఒబామాకు చర్చించడం రాదు : డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో చర్చలు జరిపే సామర్థ్యం ఆయనకు లేదు. అందుకే ఆయన యుద్ధానికి వెళ్లే అవకాశం ఉంది. 2011లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్న మాటలివి. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు ట్రంప్ ఇరాన్ (Iran)పై దాడులు చేయించారు. ట్రంప్ గతంలో చెప్పిన మాటలకు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 2011 నవంబరులో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసమే ఒబామా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రారంభిస్తారు అని అందులో రాసుకొచ్చారు. అదే ఏడాది ఆయన మాట్లాడిన ఓ వీడియో (video) కూడా బయటికొచ్చింది. ఇరాన్‌తో చర్చలు జరిపే సమర్థత ఒబాబాకు లేదు. ఆయన ఓ బలహీన, అసమర్థ అధ్యక్షుడు అని నాడు ట్రంప్ విమర్శించారు. ఇక, 2013లోనూ ఇదేతరహా ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై ఒబామా దాడి చేస్తారని నేను ఏనాడో అంచనా వేశా. ఆయనకు చర్చించడం రాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.