Donald Trump :నోబెల్ ను వదలని అమెరికా అధ్యక్షుడు

ప్రపంచ శాంతికాముకుడిని అనిపించుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్ష ఏమాత్రం తగ్గడంలేదు. అందుకోసం ఆయన మిత్ర బృందం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. తాజాగా ఆయన పేరును అధికారికంగా నామినేట్ చేసింది. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్ ఈ మేరకు నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ పంపించారు. అసాధ్యమనుకొన్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఇరాన్`ఇజ్రాయెల్ (Iran- Israel) మధ్య 12 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతూ శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్రాత్మక భూమిక వహించారు. ఆయన నాయకత్వాన్ని నోబెల్ బహుమతి (Nobel Prize)తో గుర్తించాలి అని కోరారు. ట్రంప్ పేరును పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం ఇటీవల నోబెల్ పురస్కారానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే.