2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ
ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, నాటోపై విరుచుకుపడ్డారు. ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలహీనత కారణంగానే రష్యా పొరుగు దేశమైన ఉక్రెయిన్పై దాడులు చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా తమని ఓడించే ఉండకపోతే, ఈ భయంకర విపత్తు జరిగేదే కాదని అన్నారు. పుతిన్ తెలివైనవాడు అనేది సమ్యస కాదు, కానీ మన నాయకులు మౌనంగా ఉండిపోవడమే అసలైన సమస్య అని అన్నారు. ఏడాదిపాటుగా ప్రవాసంలో గడిపిన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ వార్షిక సమావేశంలో కనిపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా నాలుగో రోజు కూడా సైనిక దాడులను కొనసాగిస్తోంది. వ్యూహాత్మక నగరం నోవాకఖోవ్కాను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్పై క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి.






