Donald Trump: ఈ వారంలో ట్రంప్-పుతిన్ భేటీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump ), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఈ వారంలో చర్చలు జరిపే అవకాశం ఉందని ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ (Steve Witkoff ) తెలిపారు. ఈ చర్చలతో యుద్ధాన్ని ముగించే విషయంలో పురోగతి కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా(Russia )-ఉక్రెయిన్ (Ukraine ) వ్యవహారంపై ఫిబ్రవరిలో తొలిసారి పుతిన్‌తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపునకు ఉన్నత స్థాయి చర్చలు జరపాలని నాడు నిర్ణయించుకున్నారు.