Trump :పుతిన్, ట్రంప్ అంగీకారం … ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై!

మూడేళ్లుకుపైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజులపాటు దాడులు నిలిపివేసేలా చూడాలని అమెరికా(America), రష్యా (Russia) నిర్ణయించాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin ) తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గంటకుపైగా ఫోన్లో చర్చించారు. ముందుగా ఈ రెండు రంగాల వరకు దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించారని, శాంతి దిశగా ఇది తొలి అడుగు అని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. నల్ల సముద్రంలో దాడుల విరమణకు, ఆ తర్వాత పూర్తి యుద్ధం అంతానికి ఇది దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ దిశగా చర్చలు వెంటనే మొదలవుతాయని తెలిపింది.