America : అమెరికా ఆరోగ్య శాఖలో 10 వేల మంది ఉద్యోగులపై వేటు!

పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అమెరికాలోని ఆరోగ్య, మానవ సేవల విభాగంలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం నిర్ణయించింది. అంటు వ్యాధుల నివారణ, ఆహారం, ఆస్పత్రుల తనిఖీ, ఆరోగ్య బీమా (Health insurance) వంటి విధులను ఈ విభాగమే నిర్వహిస్తుంది. ప్రస్తుతం దీంట్లో 82వేల మంది ఉద్యోగులు ఉండగా, దాన్ని 62వేలకు తగ్గించాలని నిర్ణయించింది. లేఆఫ్‌లు, స్వచ్ఛంద, ముందస్తు పదవీ విరమణలు, ఇతర మార్గాల్లో ఉద్యోగులను తొలగించనుంది. లేఆఫ్‌ల (Layoffs) ద్వారా 10 వేల మందిని, ఇతర మార్గాల ద్వారా మరో పది వేల మందిని తీసేయనుంది. అందులో భాగంగా తొలుత పది వేల మందిని తొలగించడానికి ఏర్పాట్లు చేస్తోంది.