Student visa: అందుబాటులో వేలల్లో విద్యార్థి వీసా అపాయింట్‌మెంట్లు

భారత్‌లోని కాన్సులేట్లలో వేల విద్యార్థి వీసా (Student visa) ( ఎఫ్1) అపాయింట్‌మెంట్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడిరచింది. ఈ వివరాలకు సంబంధించి వెబ్‌పేజీ (Webpage) ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. గత ఏడాది 1,40,000 వీసాలను విద్యార్థులకు అమెరికా ఇచ్చింది. ఈసారి అంతే సంఖ్యలో విద్యార్థులను ఆకర్షించాలని భావిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆంక్షల నేపథ్యంలో విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది.