Statue of Liberty : స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఇవ్వడం కుదరదు : అమెరికా

అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది 305 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (Statue of Liberty) విగ్రహం. దీన్ని అమెరికాకు ఫ్రాన్స్ (France) బహూకరించిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహాన్ని తమకు తిరిగిచ్చేయాలని ఫ్రాన్స్‌కు చెందిన నేత రాఫెల్ గ్లక్స్‌మాన్ (Raphael Glucksman) ఇటీవల డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై అగ్రరాజ్యం స్పందించింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమైనవని, విగ్రహాన్ని వెనక్కు తిరిగిచ్చేదిలేదని స్పష్టం చేసింది. ఏ విలువలను చూసి ఆ విగ్రహాన్ని అమెరికాకు అందజేశామో ఆ విలువలు ప్రస్తుతం అగ్రరాజ్యంలో కనిపిచడం లేదని గ్లక్స్‌మాన్ విమర్శించారు. అందుకే దాన్ని వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అయితే కేవలం అమెరికా వల్లే ఫ్రాన్స్ ఇప్పుడు జర్మన్‌లో మాట్లాడటం లేదని వైస్‌హౌస్ ప్రెసె సెక్రటరీ కరోలిన్ లివిట్ (Caroline Leavitt) పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ నేత గుర్తు చేసుకోవాలన్నారు. దీనికి వారు యూఎస్‌కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలన్నారు. యూఎస్‌తో స్నేహబంధానికి గుర్తుగా ఫ్రాన్స్ అందించిన ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని న్యూయార్క్‌లో 1886, అక్టోబరు 28న ఏర్పాటు చేశారు.