అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం.. అయినా ఆగలేదు
అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవమైన మంగళవారమూ కూడా కాల్పుల మోత ఆగలేదు. మూడు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో నలుగురు మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. మీడే వీధిలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుగుతుండగా నల్ల రంగు ఎస్యూవీలో వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. క్షతగాత్రులను అగ్నిమాపక, ఈఎంఎస్ వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు. మరికొందరు సొంతంగా చేసుకున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసు అధికారులు తెలిపారు. మేరీలాండ్లోని తూర్పు తీర ప్రాంతం శాలిస్ బరిలో జరిగిన ఓ పార్టీలో కాల్పులు చోటు చేసుచేసుకున్నాయి. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. లూసియాలోని శ్రేవ్పోర్టులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు.






