America: ఎఫ్ 1 వీసాల్లో అమెరికా భారీగా కోత

విద్యార్థుల (Students) కోసం జారీ చేసే ఎఫ్1 వీసా (F1 visa) ల్లో గత కొంత కాలంగా అగ్రరాజ్యం భారీగా కోత పెడుతోంది. దశాబ్ద కాలంగా అన్ని దేశాల నుంచి వస్తున్న ఎఫ్1 వీసా దరఖాస్తులను పెద్దఎత్తున తిరస్కరిస్తోంది. అలా తిరస్కరణకు గురైన దరఖాస్తులు గత ఆర్థిక సంవత్సరంలో (అక్టోబరు 2023 నుంచి సెప్టెంబరు 2024) 41 శాతానికి చేరాయి. దీంతో దశాబ్ద కాలం లోనే ఎక్కువగా దరఖాస్తులు తిరస్కరణ (Rejection) కు గురైన సంవత్సరాల్లో గతేడాది అగ్రస్థానంలో నిలిచింది. 2023-24లో వివిధ దేశాల నుంచి ఎఫ్-1 వీసా కోసం మొత్తం 6.79 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 2.79 ( 41 శాతం) లక్షలను అమెరికా (America) తిరస్కరించిందని ఆ దేశ విదేశాంగ శాఖ నివేదిక వెల్లడిరచింది. ఆ నివేదిక ప్రకారం.. 2014లో 77.48 శాతంగా ఉన్న ఆమోదం రేటు, 2023`24 సంవత్సరానికి 58.9 శాతానికి పడిపోయింది.