డొనాల్డ్ ట్రంప్ పై నిక్కీ హేలీ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వ కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డిక్స్‌విల్లే నాచ్ ప్రైమరీలో విజయం సాధించారు. మొత్తం ఆరుకు ఆరు ఓట్లను హేలీ కైవసం చేసుకున్నారు. న్యూ హ్యాంఫ్షైర్ ఫస్ట్ రౌండ్‌ల్లో డిక్సివిల్లే నాచ్లోని ఆరు రిజిస్ట్రర్డ్ ఓటర్లు హేలీని ఎన్నుకున్నారు. దీనిపై నిక్కీ హేలీ హర్షం వ్యక్తం చేశారు. న్యూ హాంప్‌షైర్‌లో ఇది ఒక గొప్ప ఆరంభం.. గొప్ప రోజు థ్యాంక్యూ డిక్స్‌విల్లే నాచ్ అంటే ఆమె తన స్పందనను తెలియజేశారు. ఇద్దరు ఇండిపెండెండ్లు, నలుగురు రిజిస్ట్రర్డ్ రిపబ్లికన్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా, రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం పది శాతం మాత్రమేనని చెబుతున్నారు.






