ప్రత్యర్థులు ఎవరూ లేకపోయినా… నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ
ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం రాష్ట్రాల వారీగా ప్రైమరీలు జరుగుతున్నాయి. తాజాగా నెవడాలో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీలో నిక్కీ హేలీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎవరూ లేకపోయినా, ఓటర్లు ఆమెకు షాకిచ్చారు. నన్ ఆఫ్ దీజ్ కాండిడేట్స్ మీట నొక్కి ఆమెను తిరస్కరించారు. అంటే మనదగ్గర నోటా లెక్క. నన్ ఆఫ్ దీజ్ కాండిడేట్స్కు 61 శాతం ఓట్లు పోలవ్వగా నిక్కీకి 32 శాతం ఓట్లు వచ్చాయి. నెవడాలో ప్రధాన పోటీదారైన ఆమెను ఓటర్లు ఈ రకంగా ఓడిరచారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 6న డెమోక్రట్, రిపబ్లికన్ పార్టీలకు ప్రైమరీలు జరిగాయి. డెమోక్రట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు. రిపబ్లికన్ల తరపున ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలో నిల్చొలేదు. కేవలం నిక్కీ మాత్రమే పోటీ చేశారు.






