అమెరికాలో వీటిని వాడొద్దన్న టెస్లా అధినేత
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలని టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ అన్నారు. పోలింగ్ చేపట్టేందుకు వినియోగిస్తున్న ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురువుతున్నాయని ఆరోపణలు చేశారు. అమెరికా నియంత్రణలోని ప్యూక్టోరికోలో ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించి బ్యాలెట్లను వాడటం వల్ల హ్యాకింగ్‌ను నివారించొచ్చని మస్క్ సూచించారు. ఈవీఎంలను వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి పర్యావసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ఆయన తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ కూడా ప్యూక్టోరికోలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు జరిగాయని ఆరోపించినట్లు మస్క్ తెలిపారు. ఈ సమ్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలని, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని మస్క్ స్పష్టం చేశారు.






