Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ రేసులో భారత సంతతి వ్యక్తి

అమెరికాలోని న్యూయార్క్ (New York) నగర మేయర్ పదవికి నవంబరులో జరగనున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ (Democratic Party) అభ్యర్థిగా భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) ఎన్నికయ్యారు. ఈ అభ్యర్థిత్వం కోసం తనతో పోటీ పడిన ప్రముఖ నాయకుడు మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమో (Andrew Cuomo) ను ఆయన ఓడిరచారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాక పోవడంతో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ ఎన్నిక ఫలితాన్ని వెల్లడిరచారు. జొహ్రాన్ మమ్దానీ సలాం బాంబే, మాన్‌సూన్ వెడ్డింగ్ వంటి చిత్రాలు రూపొందించిన ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత దర్శకురాలు మీరానాయర్ (Meera Nair ) కుమారుడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ గుజరాత్‌కు చెందినవారు.