H-1B Visa: ఆ వీసాదారులను పంపించేయాలి : రోహిత్
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రోహిత్ జాయ్ (Rohit Joy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా (H-1B Visa )లను రద్దు చేయాలి. ఆ కార్యక్రమాన్నే ఆపేయాలి. హెచ్-1బీ వీసాదారులను అమెరికా (America) నుంచి పంపించేయాలి అంటూ ట్రంప్ (Trump) సర్కారుకు మతిలేని సూచనలు చేశారు. హెచ్-1బీ, ఇతర వీసాదారుల వీసాలు పునరుద్ధరించాలన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్మెక్ కార్మిక్ (Rich McCormick) వ్యాఖ్యలను జాయ్ వ్యతిరేకించారు. అమెరికాలో పోటీలో ముందు నిలపడంలో హెచ్-1బీ వీసా విధానం పాత్ర ఏమీ లేదని చెపుకొచ్చారు.ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులేనన్నది తెలిసిందే. వారంతా జాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.






