అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కు పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టు లో చుక్కెదురు
2020 అద్ధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు నుంచి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు అధ్యక్షులు ట్రంప్ బృందం వివిధ రాష్ట్రాలలో 2020 అద్ధ్యక్ష ఎన్నికల ఫలితాల పై అనేక రకాల ఆరోపణలు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.
“2020 అద్ధ్యక్ష ఎన్నికల ఫలితాల ధృవీకరణను నిరోధించాలి, మోసపూరిత ఎన్నికల వ్యవస్థ మరియు సరికాని బ్యాలెట్ లెక్కింపు” వంటి వాదనలకు సాక్ష్యాలను కనుగొనటానికి తన న్యాయవాదులకు సమయం ఇవ్వాలి అన్న అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బృందం అభ్యర్థనను రాష్ట్ర పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టు శనివారం 21 నవంబర్ న ఖండించింది.
“2020 అద్ధ్యక్ష ఎన్నికలలో కామన్వెల్త్లోని బ్యాలెట్ లో వేసిన ప్రతి ఓటును నిరాకరించే అవకాశం ఉందని” అధ్యక్షులు ట్రంప్ వాదనకు మద్దతుగా అధ్యక్షులు ట్రంప్ ప్రచార బృందం తరుఫు న్యాయమూర్తులు సమర్పించిన సాక్ష్యాలు కు సరిఐన ఆధారాలు లేవు అని అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి మాథ్యూ బ్రాన్ విమర్శించారు.
అధ్యక్షులు ట్రంప్ ప్రచార బృందం మరియు ఇద్దరు రిపబ్లికన్ ఓటర్లు తమ బ్యాలెట్లను సాంకేతికత కోసం తిరస్కరించాలి అన్న ఫిర్యాదులను న్యాయమూర్తి మాథ్యూ బ్రాన్ తీర్పు పూర్తిగా తోసిపుచ్చింది. ఈ తీర్పు అనేక ఆరోపణలను సవరించడానికి అనుమతి నిరాకరించనున్నట్లు నిపుణుల అంచనా.మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ చేతిలో ఓడిపోయిన కీలక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి కోర్టులను ఆశ్రయించాలన్న అద్ధ్యక్షులు ట్రంప్ ప్రయత్నంలకు ఈ తీర్పు అడ్డుకట్టవేసినట్టు అయింది అని నిపుణులు పేర్కొన్నారు.






