Maria Farmer: డొనాల్డ్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేసిన నటి మారియా ఫార్మర్

ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంపై మొదటగా ఫిర్యాదు చేసిన మారియా ఫార్మర్ (Maria Farmer) అనే అమెరికా కళాకారిణి తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సందర్భం లో ట్రంప్ తనను అసభ్యకరంగా చూశారని, తాను ఎంతో భయపడ్డానని పేర్కొన్నారు. 1995లో తాను ఎప్‌స్టీన్ (Epstein) కోసం పనిచేయాలనుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఒక రోజు బాగా పొద్దుపోయాక ఎప్‌స్టీన్ తనను మన్‌హట్టన్ (Manhattan) లోని ఆఫీసులో కలవాలని ఫోన్ చేశాడని, దీంతో రన్నింగ్ షార్ట్స్ (Running shorts) లోనే వెంటనే అక్కడకు వెళ్లాల్సి వచ్చిందని మారియా పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్ అక్కడికి వచ్చారని గుర్తు చేసుకొన్నారు. తనకు సమీపంలోనే నిలబడి తన కాళ్ల వైపు పదేపదే అభ్యంతరకరంగా చూశారని, దీంతో తనకు చాలా భయం వేసిందని ఆమె తెలిపారు. అప్పుడే వచ్చిన ఎప్‌స్టీన్ ఆమె నీకోసం కాదు అంటూ ట్రంప్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తన వయసు 20 అని వివరించారు.