Doze : డోజ్‌కు త్వరలో మస్క్ గుడ్‌బై?

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ( డోజ్) సారథ్య పదవికి ఎలాన్ మస్క్ (Elon Musk) రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్క్ సయ్యంగా వెల్లడిరచారు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ ఇప్పటికే డోజ్ బృందంలోని కీలకమైన ఏడుగురు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సంస్థ తదుపరి కార్యచరణపై చర్చించారు. ఆరామ్ మొఘాద్దాషీ, స్టీవ్ డేవిడ్, బ్రాడ్ స్మిత్, అంటోనీ ఆర్మ్‌స్ట్రాంగ్ (Antony Armstrong) , జోయి గిబ్బియా, టోమ్ క్రాస్ (Tom Cross) , టైలర్ హసేన్‌లతో మస్క్ సమావేశమయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు కుడిభుజంగా వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దు చేయడం తెలిసిందే. దాంతో ఆయన తప్పుకున్నాక డోజ్ విభాగం ఉంటుందా, ఉంటే నూతన సారథి ఎవరంటూ చర్చ మొదలైంది.