అది అద్భుతమైన చర్య.. పుతిన్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ప్రపంచ దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతుంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రశంసలు కురిపించారు. పుతిన్ మేధావి అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లోని డానెట్స్ కు, లుహాన్స్ కు లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నారు. ద క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్ట్సాన్ షోలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్‌లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవిలో చూశానని పేర్కొన్నారు. అది అద్బుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే ..రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ స్వయంగా శాంతి కాముకుడిగా నిలిచిపోతారని అన్నారు. అది అత్యంత శక్తిమంతమైన శాంతి కాముక బలగమని వ్యాఖ్యానించారు. అలాంటి చర్యలను అమెరికా దక్షిణాది సరిహద్దుల్లోనూ తీసుకోవాలన్నారు. పుతిన్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఆయన గురించి తనకు బాగా తెలుసని ట్రంప్ చెప్పారు.






