కిమ్ తో టచ్ లొ ఉన్నా డొనాల్డ్ ట్రంప్

ప్యోంగ్యాంగ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరపైకి వచ్చారు. వైట్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ట్రంప్ పై మాగీ హేబెర్మాన్ రాయబోయే ది కాన్ఫిడెన్స్ మ్యాన్ పుస్తకంలో ఈ విషయం వెల్లడైంది. 2018లో నేను కిమ్ లేఖలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ప్రేమలో పడ్డామని అప్పట్లో ట్రంప్ ప్రముఖంగా ప్రకటించారు. అయితే కొరియా ద్వీపకల్పాన్ని అణునిరాయుధీకరించే లక్ష్యంతో ఉత్తర కొరియా అధినేతతో జరిగిన రెండు సమావేశాలు ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమయ్యాయి. కిమ్‌తో ట్రంప్ టచ్‌లో ఉన్నారన్న వాదనలు ధ్రువీకరించబడలేదని హెబర్ మాన్ అన్నారు. కిమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పిన ఏకైక విదేశీ నేత ట్రంప్ మాత్రమేనని ఆమె తెలిపారు.