Donald Trump: భారత్ పై ట్రంప్ గురి తప్పుతుందా ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump).. రెండో సారి అధికార పగ్గాలు చేపట్టడానికి ఇచ్చిన పిలుపు అమెరికా మేక్ గ్రేట్ ఎగైన్. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్.. దేశం ఆర్థిక రంగం బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా వివిధ దేశాలతో తమ ఆర్థిక లావాదేవీలపై కన్నేశారు. వాటి లెక్కలను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేశానికి తాముగతంలో ఉత్పత్తులపై ఎంత రాయితీలు ఇచ్చారు.. ఇప్పుడు వాటి నుంచి సమానస్థాయికి ఎలా తేవాలన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఇది .. అగ్రరాజ్యం అమెరికా ఆదాయాన్ని పెంచి ఉండొచ్చు గాక.. కానీ ఆదేశం అగ్రరాజ్య పరపతిని పాతాళంలోకి నెట్టేస్తోంది. అమెరికాను సైతం ఓసాదారణ ధనిక దేశంగా మార్చేస్తోంది. ఎందుకంటే.. అమెరికా ఇప్పుడు కేవలం బిజినెస్ డీల్స్ మాత్రమే చూస్తోంది. తమకు అత్యంత నమ్మకస్తులు, బ్రదర్ హుడ్ లాంటి మెక్సికో, కెనడా లాంటి దేశాలను సైతం టారిఫ్‌ల పేరుతో బెదిర్ఱించింది. ఇక కెనడాకు అయితే వచ్చి తమతో కలిసిపోతే పోలా అంటూ.. ట్రంప్ సెటైర్ కూడా వేశారు. దీంతో ప్రపంచ పరిణామాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. కెనడా లాంటి దేశం కూడా యూరప్‌తో కలిసి అడుగులేసేందుకుప్రయత్నిస్తోంది. ఇక వెనెజులా నుంచి వస్తున్న మాదకద్రవ్యాలు.. తమను ఇబ్బందులుపాలు చేస్తున్నాయంటూ అక్కడి మదురో సర్కార్‌పై చిందులు తొక్కిన ట్రంప్.. ఏకంగా కరేబియన్ సముద్రంలోకి నావికా దళాలను సైతం పంపారు. అంటే ఓరకంగా ఆదేశాన్ని బెదిరిస్తున్నారు.
అయితే ఈవ్యవహారంలో ఫస్ట్ ట్రంప్… చైనాపై టారిఫ్ కత్తి రaలిపించారు. అంతేనా.. అత్యధికంగా టారిఫ్ ఆంక్షలతో డ్రాగన్ ను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారు. కానీ ట్రంప్ గురించి బాగా తెలిసిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఓ వైపు ఎదిరిస్తూనే , నెమ్మదిగా ట్రంప్ కు వాస్తవం అర్థమయ్యేలా చేశారు. దీంతో అత్యధిక టారిఫ్ నుంచి చైనాకు విముక్తి లభించింది. కానీ.. తొలి నుంచి అమెరికా చేయి పట్టుకుని తిరిగిన భారత్ కు మాత్రం … ఇవి ఇబ్బందికరంగా మారాయి. చర్చలకోసం చేయి చాచి, అమెరికాతో ఘర్షణను కోరుకోని మోడీ సర్కార్ .. ట్రంప్ సర్కార్ కోరిన రాయితీలు విని షాకైంది. ఏకంగా వ్యవసాయం, పాడి సహా కీలక రంగాల్లో భారీ రాయితీలు కోరింది అమెరికాప్రభుత్వం. ఎన్నోదఫాలుగా జరిగిన చర్చలు కూడా.. ఈవిషయంలో ఫలితమివ్వలేదు. దీంతో ట్రంప్ సర్కార్ కు కోపమొచ్చింది.
అమెరికన్లలోనే అసహనం..
డోనాల్డ్ ట్రంప్ మాజీ కార్యదర్శి జాన్ బోల్టన్ సంచలన కామెంట్స్ చేసారు. రష్యా, చైనాల నుండి భారతదేశాన్ని దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాదంలో పడేశారని, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదన్నారు. ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్దానికి భారత్ మద్దతు ఇస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ సుంకాలు విధించారు. చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా ఆ దేశానికి మాత్రం సుంకాలు విధించలేదు ట్రంప్. అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా ఈ సుంకాలను తప్పుబట్టారు. భారత్-అమెరికా సంబంధాలకు దీర్ఘకాలిక నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సుంకాలు అమెరికాపై నమ్మకాన్ని మరింతగా పోగొట్టే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ విషయంలో భారత్ కు వెనక్కు తగ్గడం లేదు. అమెరికాతో చేసుకున్న జెట్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది భారత్. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ట్రంప్ సర్కార్ ప్రకటనల వెనక వ్యూహం..
వాస్తవానికి రష్యా చమురును కొంటున్నందుకు భారత్‌ను ట్రంప్ టార్గెట్‌గా చేసుకున్నారు. కానీ, రష్యా నుంచి యూరోపియన్ దేశాలకే ఎక్కువగా ఇంధనం ఎగుమతి అవుతోందని సీఆర్‌ఈఏ రిపోర్ట్ నివేదించింది. 2025 ఏప్రిల్‌లో రష్యా నుంచి యూరోపియన్ దేశాలకు 3.32 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఎగుమతి అయిందని సీఆర్‌ఈఏ తెలిపింది. 2025 జూన్‌లో 3.01 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయినట్లు పేర్కొంది. సీఆర్‌ఈఏ రిపోర్టు ప్రకారం.. భారత్, చైనాలు రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారులు. కానీ, యూరోపియన్ యూనియన్ అతిపెద్ద గ్యాస్ కొనుగోలుదారుగా ఉంది.
బొగ్గు.. 2022 డిసెంబర్ 5 నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 44 శాతం చైనా కొనుగోలు చేసింది. భారత్ కేవలం 19 శాతమే కొన్నది. తుర్కియే 11 శాతం, దక్షిణ కొరియా 9 శాతం, తైవాన్ 4 శాతం కొనుగోలు చేశాయి. క్రూడాయిల్.. రష్యా మొత్తం క్రూడాయిల్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేసింది. క్రూడాయిల్ కొనుగోళ్లలో భారత్ రెండో స్థానంలో ఉంది. మొత్తం ఆయిల్‌లో 38 శాతం భారత్ కొన్నది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, తుర్కియే 6 శాతం చొప్పున చమురును కొన్నాయి. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)… యూరోపియన్ యూనియన్ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. మొత్తం రష్యా ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో 51 శాతం యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 13 శాతం చైనా, 12 శాతం బ్రెజిల్ కొన్నాయి. పైప్‌లైన్ గ్యాస్.. పైప్‌లైన్ల ద్వారా అత్యధిక గ్యాస్‌ను కూడా రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కొన్నది. మొత్తం పైప్‌లైన్ గ్యాస్ ఎగుమతుల్లో 37 శాతం యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేసినవే. ఆ తర్వాత 30 శాతం చైనా, 27 శాతం తుర్కియే కొనుగోలు చేసింది.
ఈ వాస్తవాలన్నింటినీ ప్రస్తావిస్తూ… ట్రంప్ సర్కార్ టారిఫ్‌లు అన్యాయమంటూ భారత్ గళమెత్తింది. తొలుత నెమ్మదిగా స్పందించిన భారత్ ప్రతినిధులు తర్వాత గట్టిగానే బదులిస్తున్నారు. చైనా, ఈయూలకు లేని రూల్స్.. మాకే ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. వాటిని పక్కన పెట్టి.. తాము చెప్పినట్లు చేయాలంటూ భారత్ పై అమెరికా గద్దిస్తోంది. దీంతో అమెరికా ఏకపక్ష తీరు ఎలా ఉంటుందో మోడీ సర్కార్ సైతం అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. గతంలో అమెరికాతో తాము స్నేహానికి ఇచ్చిన ప్రాధాన్యతకు .. ట్రంప్ సర్కార్ ఏపాటి విలువ ఇస్తుందో అర్థం కావడంతో మోడీ సర్కార్ సైతం ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలు పెట్టింది.
ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్..
అమెరికాయేతర ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై భారత్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా బద్దశత్రువులా భావించే డ్రాగన్‌తో కలసి ముందుకెళ్లాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా షాంగై సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి మోడీ దర్శనమిచ్చారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు కూడా. ఇక పలు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇక ఇందులో మరోముఖ్యమైన అంశం ఏమిటంటే… పొరుగుదేశం దృష్టితో మన సంబంధాలు చూడొద్దంటూ జిన్ పింగ్… మోడీ సర్కార్ కు సూచించారు.
వాస్తవం ఏమిటి?
భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు 2022లో రష్యా`ఉక్రెయిన్ యుద్ధం తర్వాత గణనీయంగా పెరిగాయి. యుద్ధానికి ముందు రష్యన్ ఆయిల్ భారత దిగుమతులలో 1 శాతం కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం అది 30`42 శాతానికి పెరిగింది. ఈ దిగుమతులు రాయితీ ధరలకు లభించడం వల్ల భారత్ దాదాపు 2.5 బిలియన్ డాలర్లను ఆదా చేసిందని అంచనా. భారత్ ఈ క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసి, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ వాణిజ్యం చట్టబద్ధమైనదని భారత్ వాదిస్తోంది. నవారో ఈ వాణిజ్యాన్ని ‘రష్యా యుద్ధ యంత్రానికి ఆర్థిక సహాయం‘గా చిత్రీకరిస్తున్నాడు. నవారో వ్యాఖ్యలు, ట్రంప్ సుంకాల విధానం భారత్‌పై వ్యక్తిగత దాడిగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ చైనా, రష్యా పర్యటనలు, ముఖ్యంగా ఎస్‌సీవోసమ్మిట్‌లో షీ జిన్‌పింగ్, పుతిన్‌లతో సమావేశాలు, ట్రంప్ బృందాన్ని కలవరపెడుతు న్నాయి. ఇంకా, నవారో మోడీ ధ్యానం చేస్తున్న ఫోటోను షేర్ చేసి, భారత సంస్కృతిని లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు భారత్-అమెరికా సంబంధాలలో ఒత్తిడిని పెంచుతున్నాయి.
ట్రంప్ ది పక్కా బిజినెస్ స్ట్రాటజీ..
‘‘ట్రంప్ తన వైఖరిని అకస్మాత్తుగా మార్చుకోవడం -ముందు చైనా వైపు భారత్ మళ్లిందని చెప్పడం, ఆ తర్వాత అమెరికా, భారత్ చాలా ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాయని చెప్పడం – విదేశాంగ విధానం విషయంలో ఆయన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ప్రకటనలు ఒకేసారి ఎక్కువమందికి తను చెప్పదలుచుకుంది చెప్పే వీలు కల్పిస్తాయి. ఆయన స్వదేశంలో తన మద్దతుదారులకు బలంగా కనిపిస్తారు. అదే సమయంలో తన మిత్రదేశాలతో సంబంధాలను కొనసాగిస్తారు’’ అని దౌత్య నిపుణులు చెబుతున్నారు. ‘ఈ భిన్నమైన ప్రకటనలు పొరపాటున వచ్చినవి కాదు. ట్రంప్ రాజకీయాల తీరు ఇదే. మీడియాలో చర్చ, ఒత్తిడి సృష్టించే ఉద్దేశంతో ఆయన ప్రకటనలుంటాయి. ఒక రోజు ఆయన కఠినంగా మాట్లాడతారు. తర్వాతిరోజు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తన మాటలను మార్చగలరు’’ .’’ముందు చేసిన బెదిరింపు ప్రకటన ఒత్తిడిని పెంచడానికి. తర్వాత బలహీనంగా కనిపించకుండా సంబంధాన్ని కొనసాగించడానికి భరోసా ఇచ్చే ప్రకటన చేశారు’’ అని నిపుణులు విశ్లేషించారు.
భారత్‌తో బంధం తెగకుండా ట్రంప్ ముడి వేశారా..?
బంధం బీటలు వారుతున్న సమయంలో ట్రంప్ భారత్‌తో తమది ప్రత్యేక బంధం అంటూ ప్రకటించారు. మోడీతో సన్నిహిత సంబంధాలు న్నాయన్నారు. దీనికి మోడీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. ‘మా అనుబంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ భావాలను, ఆయన సానుకూల అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. భారతదేశం, అమెరికా చాలా సానుకూలమైన, సంబంధాలను ముందుకు తీసుకెళ్లే సమగ్రమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’’ అని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.అమెరికాతో మన భాగస్వామ్యానికి ప్రధాని మోడీ ఎంతో ప్రాముఖ్యమిస్తున్నారని ఎస్ జైశంకర్ అన్నారు. ట్రంప్‌తో ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలున్నాయి. అమెరికాతో చర్చలు జరుపుతున్నాం. ఈ సమయంలో నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను’’ అని ఆయనన్నారు. మోడీ రియాక్షన్ చక్కగాఉందంటున్నారు దౌత్య నిపుణులు. అయితే నేతల మధ్య ఫోన్ కాల్స్ జరిగితే ఇంకా బాగుండని అభిప్రాయపడుతున్నారు కూడా. ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై అమెరికా ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి అమెరికా సర్కార్ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండోవిడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడిరచారు. రష్యా ఆర్థికవ్యవస్థ కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారని వ్యాఖ్యానించారు.
వసూలు చేసిన టారిఫ్ సొమ్ములు వెనక్కి ఇస్తుందా..?
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక అధికారాలను వాడి దేశాలపై పన్నులు విధించడం చట్ట విరుద్ధం అని అమెరికా ఫెడరల్ కోర్టు ఇటీవలే పేర్కొంది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా న్యాయమూర్తులు ఈ తీర్పును సమర్థిస్తే.. టారిఫ్‌ల రూపంలో వసూలుచేసిన సొమ్ములు వెనక్కి ఇచ్చేస్తారా..? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందించారు.
‘‘మేము దాదాపు సగానికి పైగా టారిఫ్ సొమ్ములను తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. ఇది ఖజానాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. న్యాయస్థానం చెబితే మేము చేసి తీరాల్సిందే. కాకపోతే సుప్రీంకోర్టులో మేమే గెలుస్తాం’’ అని స్కాట్ విశ్వాసం వ్యక్తంచేశారు. 1977 అంతర్జాతీయ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్‌నకు భారీ టారిఫ్‌లు విధించే అధికారం లేదని ఫెడరల్ కోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ట్రంప్ కార్యవర్గానికి అప్పీల్ చేసుకొనేందుకు సమయం ఇస్తూ.. అక్టోబర్ 14వ తేదీ వరకు ఈ ఆదేశాలను నిలిపివేసింది. ఈనేపథ్యంలో ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమ వాదనలు వినాల్సిందిగా కోరింది.
చైనా అధ్యక్షుడి ప్రకటనతో ఆగ్రహం..
శాంతి కావాలా అంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ .. పరోక్షంగా చేసిన హెచ్చరికలు .. ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించాయి. అవసరమైతే చైనా, రష్యాలను అడ్డుకొనేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్‌ను ఆయన ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీస్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. అమెరికా (%ఖూA%) రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ తనకు ట్రంప్ నుంచి ఈమేరకు ఆదేశాలు వచ్చినట్లు అంగీకరించారు. మిలిటరీలో భారీ పునర్‌వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. అదేమీ యుద్ధం కోరుకుంటూ చేసేది కాదని వివరణ ఇచ్చారు. చైనా, రష్యా మరేదైనా దేశం విషయంలో తమ పాలసీ స్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. బీజింగ్‌లో విక్టరీ డే పరేడ్ సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన అనంతరం ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియా, రష్యా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయన్నారు. కానీ, అవి ఎటువంటివో మాత్రం ఆయన వెల్లడిరచలేదు. చైనాను విదేశీ పాలకుల నుంచి విడిపించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమెరికన్ సైనికులను జిన్‌పింగ్ గుర్తిస్తారా, లేదా అనేది పెద్ద ప్రశ్న అని ట్రంప్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్ నేరుగా విమర్శించలేదు. ఇది యుద్ధాల యుగం కాదు.. అభివృద్ధి, సంక్షేమకాలమంటూ మోడీ ప్రకటనలి చ్చారు. మిత్రదేశానికి సందేశమిచ్చారు. అయితే ఇది.. ట్రంప్, యూరోపియన్ యూనియన్లకు రుచించలేదు. రష్యాకు భారత్ వెన్నుదన్నుగా ఉంటోందని ఆయా దేశాలు భావిస్తూ వచ్చాయి. దీనికి బదులుగా ఉక్రెయిన్, రష్యాల్లో మోడీ పర్యటించినా పెద్దగా ఫలితం దక్కలేదు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొంటూ.. దాన్ని యూరోపియన్ దేశాలకు విక్రయిస్తోందంటూ అమెరికా ఆరోపిస్తోంది. నిజానికి భారత్ కుఈ సలహా ఇచ్చిందే అమెరికా అంటూ ఓ మాజీ దౌత్య నిపుణుడు స్పష్టం చేశారు కూడా.
అమెరికాలో లాబీయింగ్‌లో భారత్ వెనకబడిందా..?
ఆపరేషన్ సిందూర్‌తో దిక్కుతోచని స్థితికి చేరిన పాకిస్తాన్… ఇప్పుడు ఒక్కసారిగా అమెరికాకు ఎలా దగ్గరయింది. అంటే అదంతా లాబీయింగ్ చలవే. అమెరికాలో ఎప్పటి నుంచే పాక్.. లాబీయింగ్ చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలతో డీల్స్ కుదుర్చుకుంది కూడా. బేసిగ్గా వాణిజ్యవేత్త అయిన ట్రంప్ కు.. ఈ డీల్స్ నచ్చడంతో పని చకచకా జరిగిపోయింది. దీన్ని కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్న భారత్ కూడా.. ఇప్పు%రి%డు రెండు లాబీయింగ్ సంస్థల్ని నియమించుకుంది. అవి వాటి పని చేస్తూ ముందుకెళ్తున్నాయి. అవి ఫలితాన్నిస్తాయేమో చూడాల్సి ఉంది.
ఇరు దేశాల మధ్య వ్యాపార బంధం..
భారత్ అవసరాలు ట్రంప్ కు తెలుసు.. అలాగే అమెరికాతో డీల్స్ భారత్‌కు ఎంత అవసరమో మోడీకి తెలుసు..దీంతో ఇద్దరు నేతలు తెగేదాకా లాగాలని అనుకోవడం లేదు. అయితే మీ బెదిరింపులకు తలొగ్గేది లేదని అగ్రరాజ్యానికి మోడీ సందేశమిచ్చారంతే.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ను ట్రంప్ ఎలా వదులుకుంటారు. ఆ ఛాన్స్ చైనా కొట్టేస్తే అమెరికా పరిస్థితి ఏంటి..? ప్రపంచానికే సాఫ్ట్‌వేర్ నిపుణులను సరఫరా చేస్తున్న భారత్ ను దూరం చేసుకుంటే… ఆ పరిణామం ఎక్కడికి వెళ్తుంది. ఇక ఫార్మా రంగం విషయానికొస్తే.. అభివృద్ధి చెందిన అమెరికాకు అత్యధికంగా మెడిసిన్స్ ఇండియా నుంచే వెళ్తున్నాయి. అలాంటిది ఆరంగంపై అమెరికా ఎంతవరకూ పన్నులేయగలదన్నది ఓ ప్రశ్నగానే మారింది.
షాంగై సదస్సులో పుతిన్, జిన్‌పింగ్, మోడీ యుగళగీతం..
భారత్ ప్రధాన మిత్రదేశం రష్యా అధినేత పుతిన్ అయితే… మోడీ, జిన్ పింగ్ తో కలిసి నడిచారు. అంతేనా… మోడీతో కలిసి ప్రయాణించేందుకు పుతిన్ పదినిముషాల పాటు వెయిట్ చేశారు. ఒకే కారులో కలిసి ప్రయాణించారు. ఈపరిణామాలతో మోడీ… తన దైన రీతిలో ట్రంప్ సర్కార్ కు షాకిచ్చారు. ఆంక్షలకు అదిరేది లేదు.. బెదిరేది లేదు.. అంటూ అంతర్జాతీయ దేశాలకు సైతం తమ విధానాన్ని చెప్పకనే చెప్పారు. ఇది ట్రంప్ అండ్ మంత్రి వర్గం, సలహాదారులకు మంట పుట్టించింది. ట్రంప్ కార్యదర్శి నవారో లాంటి వ్యక్తులైతే ..భారత్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఏకంగా బ్రాహ్మణ వాదాన్ని సైతం తెరపైకి తెచ్చారు. దీన్ని భారత విదేశాంగ ప్రతినిధులు ఖండిరచారు. ఓవైపు మోడీ పరిణతి చెందిన నాయకుడని.. అతనితో తనకు వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయంటూనే.. భారత్ పై ఆంక్షల కత్తి దూస్తున్నారు ట్రంప్. అంతేకాదు.. భారత్ తాను చెప్పినట్లు వినకుంటే.. పర్యవసానాలు మరింత తీవ్రతరంగా ఉంటాయంటూ… ఢల్లీి ఎగుమతులపై ఫోకస్ పెట్టారు.కీలకమైన సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాలను టార్గెట్ చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా రంగాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్న వాదనలున్నాయి. ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి కూడా.
భారత్‌తో టారిఫ్ వార్…
అసలే అగ్రరాజ్యం.. ఇంకేముంది. భారత్‌పై టారిఫ్ పెంచింది. తొలుత 25 శాతం టారిఫ్ ప్రకటించిన ట్రంప్ సర్కార్ క్రమంగా.. దాన్ని 50శాతం చేసింది. దారికి రాకుంటే రెండోదశ బాదుడు తప్పదని హెచ్చరిస్తోంది కూడా. భారతీయ విద్యార్థులను.. ట్రంప్ సర్కార్ వదలడం లేదు. తమ దేశానికి ఆదాయ వనరు, అంతేకాదు.. వైజ్ఞానిక వనరుగా ఉన్న భారతీయ విద్యార్థులు, నిపుణులపైనా ఆంక్షలు విధిస్తోంది. గ్రీన్ కార్డు, వీసా విషయంలో చాలా సంస్కరణలు తెచ్చింది. ఈపరిణామాలతో భారతీయ విద్యార్థులు.. అమెరికా వెళ్లాలంటే ఒకటికి , రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వీటన్నింటికీ అమెరికా చెబుతున్న ఒకే ఒక్క సాకు.. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తోడ్పుతున్నారని.. అయితే దీన్ని భారత్ ఆది నుంచి తిరస్కరిస్తోంది. వాస్తవానికి రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తోంది చైనా.. ఆ తర్వాత అమెరికా, యూరోపియన్ యూనియన్. ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి.. భారత్ టార్గెట్‌గా ట్రంప్ చెలరేగిపోయారు. ప్రస్తుతం 50శాతం టారిఫ్ విధించారు. తాను చెప్పినట్లుగా వినకుంటే మరింతగా టారిఫ్ విధిస్తానని హెచ్చరిస్తున్నారు. ఈపరిణామంపై భారత్ మాత్రమే అంతర్జాతీయం గానూ ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇక అమెరికా నిపుణులు సైతం.. దీన్ని తప్పు పడుతున్నారు.