America: జనాభాపై భారత్ గొప్పలు.. మా మొక్కజొన్న ఎందుకు కొన్నదు ? : అమెరికా

తమవద్ద 140 కోట్ల మంది ప్రజలున్నట్లు భారత్ గొప్పలు చెప్పుకొంటుందని, అమెరికా(America) నుంచి మాత్రం ఓ బుట్ట మొక్కజొన్న (Corn) పొత్తులనైనా కొనదని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) అక్కసు వెళ్లగక్కారు. సుంకాలను ఢల్లీి తగ్గించుకోకపోతే వాషింగ్టన్ (Washington) తో వాణిజ్యం విషయంలో కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత్ (India) , కెనడా, బ్రెజిల్ వంటి ముఖ్యమైన భాగస్వాములతో అత్యంత విలువైన సంబంధాల్ని భారీ సుంకాల కారణంగా అమెరికా వదులుకుంటోందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.