Donald Trump: జాగ్రత్త అది మా మిత్ర దేశం : డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

గత వారం గాజాలో కాల్పులు విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు దోహా లో సమావేశమైన హమాస్ నేతలపై సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ఖతార్ (Qatar) తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని, దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహు (Netanyahu) ను హెచ్చరించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థామీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ (Israel) హమాస్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఖతార్ జోలికి మాత్రం వెళ్లొదని అన్నారు.