Goldcard : ట్రంప్ గోల్డ్‌కార్డ్ వెబ్‌సైట్ ప్రారంభం

గోల్డ్ కార్డు (Goldcard )రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్ (Website)ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి 50 లక్షల డాలర్లు (దాదాపు రూ.43 కోట్లు) చెల్లించడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడమే ఈ గోల్డ్ కార్డు ఉద్దేశం. ప్రపంచంలో ఎక్కడ లేని అత్యంత గొప్ప దేశానికి, మార్కెట్ దారి చూపించే అద్భుత ప్రయాణం సాగించేందుకు ఎక్కడ సంతకం చేయాలని వేలాదిమంది తనను అడుగుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్న వారిని మాత్రమే వెబ్‌సైట్ అనుమతిస్తోంది. అభ్యర్థి తన పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. trumpcard.gov పేరుతో ఉన్న ఈ కొత్త వెబ్‌సైట్‌లో బంగారు రంగు కార్డును నమూనాను ఉంచారు. కార్డుపైన 5 మిలియన్ డాలర్లని అంకె ముద్రించారు. యూరప్, ఆసియా (పశ్చిమాసియాతో సహా), ఉత్తర అమెరికా (North America) , ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా వంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.