వారికి తాత్కాలిక రక్షణ హోదా : అమెరికా
తాలిబన్ల విజయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అమెరికాకు చేరుకున్న వేల మంది అఫ్గానిస్థాన్ శరణార్థులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తాత్కాలిక రక్షణ హోదా కల్పించాలని నిర్ణయించింది. వీరందరూ కనీసంగా 18 నెలల పాటు అమెరికాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసించేందుకు అకాశం కలుగుతుంది. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉండి, నేపథ్యం తనిఖీలో ఉత్తీర్ణులైన వారికే ఇది వర్తిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన ఆఫ్గానిస్థాన్ నుంచి తరలించిన శరణార్థులకు చేయూతనందించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. శాశ్వత నివాస వీసా పొందిన వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అఫ్గానిస్థాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో దాదాపు 76 వేల మందిని అక్కడి నుంచి అమెరికా తరలించింది.






