మద్దతు పలికితే ఆంక్షలు తప్పవు.. చైనాను హెచ్చరించిన అమెరికా
ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న యుద్దానికి చైనా మద్దతు పలికితే ఆ దేశం కూడా ఆంక్షలను ఎదుర్కొవలసి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు వస్తుపరమైన సాయాన్ని చైనా అందిస్తే పరిణామాలెవా ఉంటాయో డ్రాగన్ దేశానికి అవగాన కల్పించాలంటూ అమెరికా విదేశాంగ డిప్యూటీ సెక్రటరీ వెండి షెర్మన్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా అమెరికా మిత్రదేశాలు విధించిన శ్రేణి రుచి చైనాకు సోదాహరణంగా చూపించాలని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా పాలిస్తున్న తైవాన్ ద్వీపాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు చైనా చేపడుతున్న చర్యలు ఆమోద యోగ్యం కాదని, ఉక్రెయినకు మద్దతుగా నిలుస్తున్న పశ్చిమ దేశాల నుండి బీజింగ్ సరైన గుణపాఠం నేర్చుకుంటుందని హెచ్చరించారు.






