కొత్త ప్రభుత్వంతో త్వరలో చర్చలు : అమెరికా
కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) జాక్ సలీవాన్ను భారత్ పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసిన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. బైడెన్ నేడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాతీయ భద్రతా సలహాదారు న్యూఢిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది. కొత్త ప్రభుత్వంతో భారత్`అమెరికా ప్రధాన్యాలపై చర్చించనున్నారు. వీటీల్లో సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక బంధం, పరస్పర విశ్వాసం వంటి అంశాలు ఉండనున్నాయి అని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా ఎన్ఎస్ఏ పర్యటన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పర్యటన చోటు చేసుకోనుంది.






