అమెరికాకు అల్‌ఖైదా ముప్పు : ఇంటలిజెన్స్ హెచ్చరిక
వచ్చే ఏడాది అమెరికాలో అల్‌ఖైదా మునుపటి 9/11 వంటి ఘటన కు దిగవచ్చునని ఆ దేశపు నిఘా అధికారులు హెచ్చరించారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ క్రమంలో తిరిగి అల్‌ఖైదా అక్కడ బలం సంతరించుకుంటుంది. తరువాతి క్రమంలో అమెరికాలో దాడులకు వ్యూహరచనకు దిగుతుందని యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషించారు. ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేసుకుంటే దాదాపుగా ఒకటి లేదా రెండు ఏళ్లలోనే ఉగ్రదాడికి బలం సంతరించుకుంటుందని ఇంటలిజెన్స్ వర్గాల కీలక సదస్సు లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్ తెలిపారు. డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీకి స్కాట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్‌ఖైదా కొంతకాలంగా నిద్రాణంగా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు వారి ఉనికికి బలమైన స్థావరం లభించింది. అఫ్ఘన్లోని అన్ని రకాల వనరులు, అనుబంధ హంగులతో మరింత బలం సంతరించుకుంటారని తెలిపారు.






