ట్రంప్ నకు ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం నుంచి భారత సంతతి నేత వివేక్ రామస్వామికి ఓ ప్రతికూల ప్రకటన వచ్చింది. ట్రంప్‌నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని ఆ ప్రకటన తెలిపింది. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి యత్నిస్తున్నారు. పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించడానికి గతంలో సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిదే. అప్పుడు దానిపై ట్రంప్ నుంచీ సానుకూల స్పందనే వచ్చింది. మీరు ఆయనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా అని ప్రశ్నించగా, ఆయన చాలా తెలివైన వ్యక్తి ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నా అని బదులిచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్ వర్గం నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ఓటర్లు వివేక్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోకపోవచ్చు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు అని ఆ వర్గం వెల్లడించింది.






