America : 5,200 కార్యక్రమాలను రద్దు చేస్తున్నాం : అమెరికా
యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అంతర్జాతీయంగా చేపడుతున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలుకుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) వెల్లడిరచారు. కేవలం కొన్ని కార్యక్రమాలకే ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు. ఆరు వారాల సమీక్ష అనంతరం దాదాపు 5,200 కార్యక్రమాలను రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆరు వారాల సమీక్ష తర్వాత యూఎస్ ఎయిడ్ (US Aid )లోని 83 శాతం కార్యక్రమాలకు అధికారికంగా ముగింపు పలుకుతున్నాం. 5,200 కాంట్రాక్టులను రద్దు చేశాం. ఇప్పటివరకు వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినా ఫలితమివ్వకపోగా, కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు ఇచ్చాయి. ఏదేమైనా అమెరికా జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. ఈ సంస్కరణల కోసం తీవ్రంగా శ్రమించిన డోజ్ (Doze) సిబ్బందికి ధన్యవాదాలు అని రుబియో తెలిపారు.






