Fatima Bash: మిస్ యూనివర్స్ గా మెక్సికో సుందరి ఫాతిమా బాష్
థాయ్‌లాండ్‌లో (Thailand) జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికో అందగత్తె ఫాతిమా ఫెర్నాండెజ్ బాష్ (Fatima Fernandez Bash) విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తన అందం, తెలివితేటలతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచారు. పోటీ మధ్యలో అతిథ్య దేశానికి చెందిన ఓ హోస్ట్ ఆమెను అవమానించినా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఎదురు నిలిచి అందరి మన్ననలు పొందారు. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన అందాల భామ విక్టోరియా హెల్విగ్ (Victoria Hellwig), ఫాతిమాకు అందాల కిరీటం అందజేశారు. దాదాపు 120 దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనగా, వారందరినీ కాదని 25ఏళ్ల ఫాతిమాను విజయం వరించింది. థాయ్‌లాండ్ భామ మొదటి రన్నర్‌పగా నిలవగా, వెనెజువెలా (Venezuela) సుందరి రెండో రన్నర్‌పతో సరిపెట్టుకున్నారు.






