Bhattivikram Marka: పెట్టుబడులకు కేంద్రంగా ఫ్యూచర్ సిటీ: భట్టివిక్రమార్క
రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhattivikram Marka) పిలుపునిచ్చారు. ప్రజా భవన్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ అందరి సహకారంతో తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం సాధించాల్సి ఉంది అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆర్థిక పరిపుష్ఠి, సానుకూల వాతావరణం, నిపుణులైన మానవ వనరులతో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తమ సర్కారు పని చేస్తోందని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ పోలీసు (Police) వ్యవస్థల్లో తెలంగాణ పోలీసు ఒకటని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డెల్లాయిట్ (Deloitte) , ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జెఎల్ఎల్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు






