వాషింగ్టన్ డీసీలో ఘనంగా NTR నటజీవిత వజ్రోత్సవాలు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నట రత్న, పద్మశ్రీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (NTR) నట జీవిత వజ్రోత్సవ వేడుకలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్‌టీఆర్‌కు ఘననివాళి అర్పించారు. ప్రేక్షకులకు, ప్రజలకు, రాష్ట్రానికి ఎన్‌టీఆర్ సేవలు చిరస్మరణీయమని రోషన్ కొనియాడారు.
సతీష్ వేమన మాట్లాడుతూ… తమ చిన్నతనం నుండి అన్నగారి అభిమానులమని, జీవిత చరమాంకం వరకూ ప్రజాశ్రేయస్సు కోసం శ్వాసించి, జీవించిన అరుదైన నాయకుడు నందమూరి తారక రామారావు (NTR) అని, తెలుగు జాతి ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో ఆయన చిరంజీవి అన్నారు.
కార్యక్రమంలో భాను మాగులూరి, సాయి బొల్లినేని, త్రిలోక్ కంతేటి, జనార్దన్ నిమ్మలపూడి, సత్య సూరపనేని, రాజేష్ కాసారనేని, సుధీర్ కొమ్మి, చంద్ర బెవర, సత్యనారాయణ మన్నే, రవి అడుసుమిల్లి తదితరులు పాల్గొన్నారు.