Yoga: వాషింగ్టన్ డీసీ లింకన్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) లోని లింకన్ మెమోరియల్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవం భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా (Vinay Mohan Kwatra) ముఖ్య అతిథిగా పాల్గొని వేల మంది తో కలిసి యోగ సాధన చేశారు. వాషింగ్టన్, వర్జీనియా, మెరిలాండ్ ప్రాంతాల నుండి ప్రవాసులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. భారత రాయబారి కార్యాలయం ప్రత్యేకంగా బస్సులు మరియు భోజన సదుపాయాలను కల్పించింది.
ఈ వేడుకలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుండి విశ్వేశ్వర కళవల, రాము ముండ్రాతి, ఈశ్వర్ బండా, జయశ్రీ,నరసింహ తెలుకుంట్ల, వెంకట్ డండా తదితరులు పాల్గొన్నారు.