Minister Ponnam: త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి : మంత్రి పొన్నం

కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) లో మంత్రి సీసీఐ (CCI) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లు ఉన్న కొనుగోలు కేంద్రంలో తేదీ స్లాట్ ఇస్తారని చెప్పారు. పత్తికి ప్రస్తుతం రూ.8,100 మద్దతు ధర ఉందని చెప్పారు. రైతుల నుంచి వరి, మొక్కజొన్న (Corn) కొనుగోలు చేస్తామని వివరించారు. ఆయిల్‌పామ్, హార్టికల్చర్, సెరీకల్చర్ రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు(Gauravelli Project) పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.