NJ: మురళీధర్ రావు “మీట్ అండ్ గ్రీట్” విజయవంతం

న్యూ జెర్సీ అమెరికా: ప్రవాస భారతీయుల భారతీయ జనతా పార్టీ సంఘం “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ” నేషనల్ ప్రెసిడెంట్ అడపా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీ మురళీధర్ రావు (Muralidhar Rao) గారు ముఖ్య అతిథిగా “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఎడిసన్ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
మురళీధర్ రావు గారు సభను ఉద్దేశించి మాట్లాడారు. మోదీ ప్రభుత్వము గడిచిన 11 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులను క్లుప్తముగా వివరించారు. అలాగే భారతీయ జనతా పార్టీ గడిచిన 11 సంవత్సరాలలో సాధించిన ప్రగతి మరియు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎలా ఎదిగి, భారత దేశ ఎన్నికలు ప్రగతి ప్రాతిపదికన జరిగాయని, కుల, ప్రాంత, భాష, మత బేధ భావాలు లేకుండా ప్రజలు మోడీ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతు ప్రశంసనీయం అని మరియు భారత దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని, ప్రస్తుత అంతర్జాతీయ వ్యవహారాల స్థానాన్ని మరియు భారతదేశ అభివృద్ధి పై మాట్లాడారు.
మురళీధర్ రావు గారు మాట్లాడుతూ అమెరికాలో ప్రవాస భారతీయులకి ప్రాంత, భాష బేధాలు లేకుండా అందరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందదాయకం అని, ఇక్కడ వున్నా తమ భారతదేశం పట్ల వున్న ప్రేమని మరియు అభివృద్ధి చెందాలని వున్న స్పృహని అభినందించారు. దేశంలో కూడా ఇలానే దేశ భక్తి స్పృహ పెరుగుతుందని, అది మన ధర్మంతో ముడిపడి మనలోనే ఉందని, మన పూర్వజుల నుంచి మనకు సంక్రమించిందని మరియు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉందని గుర్తు చేశారు. పహాల్గమ్ లో జరిగిన సంఘటనలు, దానికి భారత ప్రభుత్వం గట్టిగా సమాధానము ఇచ్చింది అని తెలిపారు.
ప్రస్తుతం బిజెపి గత 70 సంవత్సరాలుగా వెనుకపడిన మరియు జరిగిన, జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దే పనిలో ఉందని, దానితో పాటు ఇంకా ఆ అభివృద్ధి కొనసాగేలా మరియు మన భారతీయ విలువలు, అంతర్జాతీయంగా బలపడేలా ఎంతో కృషి చేయాల్సి ఉందని, అందుకు కేవలం ప్రస్తుతం మనకి వున్న మార్గం మోడీ గారి ప్రభుత్వమేనని, పైగా మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఎవరులేరని, పైగా అంత ధైర్యంగా, దేశ విలువలకి ప్రాధాన్యతనిచ్చే వారు అసలే లేరని, ప్రవాస భారతీయులు దీన్ని గుర్తించి మోడీ గారి ప్రభుత్వాన్ని బలపర్చడానికి చేస్తున్న కృషిని అభినందించారు.
ప్రధాని మోడీ గారు అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఢిల్లీ ఎర్రకోట నుండి మాట్లాడుతూ చాలా సూక్షమైన అంశాలపై వారు ప్రస్తావించడం జరిగింది.
ఈ సందర్బంగా “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి” పూర్వ జాతీయ అధ్యక్షులు ఏనుగుల క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ, మురళీధర్ రావు లాంటి సీనియర్ లీడర్
నక్సలైట్ల తుపాకీ గుండ్లు తాకిన ఏనాడూ జాతీయ భావాన్ని వదలలేదు అని తెలిపారు.
తెలంగాణ అఫ్ బీజేపీ-అమెరికా అధ్యక్షులు మరియు తెలంగాణ గ్లోబల్ ప్రవాస కో-కన్వీనర్ విలాస్ జంబుల మాట్లాడుతూ తెలంగాణలో కూడా బీజేపీ ప్రబుత్వం రావడానికి అఫ్ బీజేపీ-అమెరికా కార్యకర్తలు పని చేస్తారు అన్నారు.
ఈ కార్యక్రమములో, అమర్ గోస్వామి, గుంజన్ మిశ్ర , శ్రీకాంత్ రెడ్డి, మరియు కమ్యూనిటి లీడర్స్ శరత్ రెడ్డి వేముల, హరి ఇప్పనపల్లి, గోపి, బాలగురు, సంతోష్ కోరం, దేవ్ కాకర్ల పాల్గొన్నారు. ఇలా పలువురి నేతలతో పాటు తెలుగు దేశం, జనసేన కూటమి తరుపున లక్ష్మి దేవినేని, ప్రేమ్ కాట్రగడ్డ, ఎంతో మంది ప్రవాస భారతీయులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.