బే ఏరియాలో ఘనంగా ప్రారంభమైన తానా-బాటా పాఠశాల తరగతులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ కొత్త విద్యాసంవత్సరం తరగతులను బే ఏరియాలో సెప్టెంబర్ 12, 13వ తేదీన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), పాఠశాల టీమ్ కొత్త విద్యార్థులకు, తల్లితండ్రులకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించింది.
పాఠశాల ఏరియా డైరెక్టర్ ప్రసాద్ మంగిన తొలుత అతిధులకు, విద్యార్థులకు, తల్లితండ్రులకు స్వాగతం పలికారు. ఈ?సంవత్సరం పాఠశాల విద్యాతరగతులకు మంచి స్పందన కనిపిస్తోందని, ఇందుకు కృషి చేసిన తానా, బాటా నాయకులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ పాఠశాలకు మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని, తానా ముఖ్య లక్ష్యం తెలుగుభాషను ప్రోత్సహించడమేనన్నారు. బాటా నాయకులను, స్థానిక పాఠశాల టీమ్‍ను ఆయన అభినందించారు.
జయరామ్‍కోమటి మాట్లాడుతూ, 7 సంవత్సరాల క్రితం పాఠశాలను ప్రారంభించడం జరిగిందని, తానా ఇప్పుడు పాఠశాలను తన ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తానాకు ఉన్న బలమైన నెట్‍వర్క్ వల్ల పాఠశాల ఇప్పుడు వివిధ చోట్లకు విస్తరిస్తోందన్నారు.
బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి మాట్లాడుతూ, పాఠశాల ప్రగతిపథంలో పయనిస్తుండటం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా పాఠశాల అభ్యున్నతికి బాటా కృషి చేస్తూనే ఉంటుందన్నారు.
పాఠశాల చైర్ నాగరాజు నలజుల మాట్లాడుతూ, పాఠశాల కార్యక్రమాలకు అన్నీచోట్లా మంచి స్పందనలు వస్తోందన్నారు. పాఠశాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వలంటీర్‍లకు, ఇతరులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ రజనీకాంత్ కాకర్ల, తానా కోశాధికారి సతీష్ వేమూరి, తానా జాయింట్ ట్రెజరర్ వెంకట్ కోగంటి తమ ప్రసంగంలో పాఠశాల ప్రగతికి తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు.
పాఠశాల సిఎండి సుబ్బారావు చెన్నూరి, అకడమిక్ డైరెక్టర్ డా. రమేష్ కొండ, కరికులం డైరెక్టర్ డా. గీతామాధవి కూడా కొత్త విద్యార్థులకు స్వాగతం చెబుతూ అభినందనలు తెలియజేశారు. బాటా అడ్వయిజర్ వీరు ఉప్పల, బాటా అధ్యక్షుడు యశ్వంత్ కుదరవల్లి, హరనాథ్ చికోటి, సుమంత్ పుసులూరి, కొండల్‍రావు, కళ్యాణ్ కట్టమూరి, కరుణ్ వెలిగేటి, శ్రీలు, దీప్తి, అరుణ్ రెడ్డి, హరి సన్నిధి, వరుణ్ ముక్క, పాఠశాల కో ఆర్డినేటర్ అనిల్ రాయల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు. టీచర్లు, పాఠశాల కో ఆర్డినేటర్లు ఈ సందర్భంగా పాఠశాల తరగతుల నిర్వహణ, బోధనా పద్ధతులు, ఇలెర్నింగ్ పోర్టల్ గురించి వివరించారు.
పిల్లలు కష్టంగా కాకుండా, ఇష్టంగా చదివేలా, వారికి భాషను నేర్పించడం, మన భాషా, సంస్కృతి ముందు తరాలకు అందించడం, పాఠ్యాంశాలను వాడుకభాషలో సులభంగా అర్థమయ్యేలా బోధించడంతోపాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, ప్రపంచంలోనే ఉత్తమమైన లక్షణాలను అలవర్చుకునేలా తీర్చిదిద్దటం పాఠశాల లక్ష్యమని చెప్పారు.
శ్రీదేవి ఎర్నేని, రవి పోచిరాజు, సౌజన్య శంకర్, సరస్వతీరావు, శిరీష బత్తుల, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, పద్మ విశ్వనాథ, సునీత రాయపనేని, దీపిక అజయ్ షీల గోగినేని, కళ్యాణి చికోటి, సత్య బుర్ర, అర్చన చాడ, మమత శ్యామ్ చాడ, సురేష్ శివపురం, పద్మ సొంటి, ధనలక్ష్మీ, మూర్తి వెంపటి, శ్రీకాంత్ దాశరథి, శ్రీధర్ కొడవలూరు, ఝాన్సీ చూడిసెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.