Vrushabha: మోహన్ లాల్ మూవీకి ఇలాంటి పరిస్థితా?
మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ గతేడాది మొత్తం మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన్నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అలాంటి హీరో నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే దానికి ఉండే క్రేజ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ క్రేజ్ తోనే మూవీకి మంచి ఓపెనింగ్స్ కూడా దక్కుతాయి.
కానీ మోహన్ లాల్ రీసెంట్ మూవీ వృషభ విషయంలో అంతా రివర్స్ అయింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ను కనీసం మెప్పించలేకపోయింది. ఫలితంగా ఈ మూవీ డిజాస్టర్ గా నిలవడమే కాకుండా కనీసం లాంగ్ రన్ లో రూ.2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. మోహన్ లాల్ నుంచి గతేడాది వచ్చిన ఎల్2: ఎంపురాన్, తుదరమ్, హృదయపూర్వం సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
వృషభ కూడా ఈ లిస్ట్ లో చేరుతుందనుకుంటే ఆ మూవీ మాత్రం అందరి ఊహలకు అతీతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. పైగా రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా జరగలేదు. దీంతో ఇప్పుడా రైట్స్ ను అమ్మడం చాలా పెద్ద తలనొప్పిగా మారడం ఖాయం. ఏదేమైనా వృషభ వల్ల నిర్మాతకు పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదన్నది మాత్రం వాస్తవం.






