BMSW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ వామ్మో వాయ్యో సాంగ్
-‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మొదటి రెండు పాటలు ఇప్పటికే అద్భుతమైన స్పందనను పొందాయి. ఇప్పుడు, మేకర్స్ మూడవ ట్రాక్ వామ్మో వాయ్యో ను వరంగల్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు.
భీమ్స్ సిసిరోలియో మరోసారి మాస్ ఆడియన్స్ కట్టిపడేసే సాంగ్ కంపోజ్ చేశారు. ‘వామ్మో వాయ్యో’ ఫుల్ జోష్‌తో సాగే ఫోక్ ట్రాక్‌గా నిలుస్తూ, వినగానే ఎనర్జీని ఇస్తుంది. లైవ్లీ ఆర్కెస్ట్రేషన్ పాటకు ప్రాణం పోస్తే, స్వాతి రెడ్డి అందించిన ప్రత్యేకమైన వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆమె వాయిస్‌లో ఉన్న ఆ ప్రత్యేక టోన్ పాటకు అదిరిపోయే ఎట్రాక్షన్ ని జోడించింది.
కలర్ ఫుల్ సెట్ డిజైన్ విజువల్స్‌ను మరింత రిచ్‌గా తీర్చిదిద్దుతూ, పాటలోని ఉత్సాహాన్ని తెరపై అద్భుతంగా ప్రజెంట్ చేసింది. దేవ్ పవార్ రాసిన లిరిక్స్‌లో రస్టిక్ ఫ్లేవర్‌తో పాటు పక్కా మాస్ టచ్ ఇచ్చింది. శేఖర్ VJ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే హై ఎనర్జీ స్టెప్స్‌తో కిక్ ఇచ్చింది.
రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ డాన్స్‌తో మరోసారి అభిమానులను అలరించారు. ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి ఇద్దరూ గ్లామర్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ తోఆకట్టుకున్నారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ డాన్స్ ఫ్లోర్‌ను పూర్తిగా దద్దరిల్లేలా చేస్తుంది. ‘వామ్మో వాయ్యో’ ఆల్బమ్‌లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ సాంగ్‌గా అలరించింది. ఈ పాట సినిమాపై ఉన్న బజ్‌ను ఇంకో లెవల్‌కు తీసుకెళ్ళింది.
సినిమాకు ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాశ్. ఈ సంక్రాంతికి జనవరి 13న వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తప్పకుండా చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. హాయ్ వరంగల్. భద్రకాళి అమ్మవారు, రుద్రమదేవి పుట్టిన నేల ఇది. ఇక్కడికి వస్తే చాలా ధైర్యంగా అనిపించింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న రిలీజ్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్ కి వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. లైఫ్ ని ఎంజాయ్ చేయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ కి రవితేజ గారితో పాటు ఇక్కడికి వస్తాను. అందరికీ థాంక్ యూ.
హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనర్జీ వామ్మో వాయ్యో సాంగ్‌లో ఉంది. రవితేజ గారు ఫెంటాస్టిక్ డాన్సర్. నేను డింపుల్ చాలా కష్టపడి డాన్స్ చేశాం. థియేటర్లో ఈ పాట మంచి వైబ్ ఉంటుంది. గ్రేట్ ఎనర్జీ మాస్ నెంబర్. సినిమా 13న రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా సూపర్ హిట్ అయింది. అది నాకు లక్కీ. మరోసారి సంక్రాంతికి వస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ.. ఈ సాంగ్ మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు చాలా స్పెషల్ సాంగ్. మీ అందరికీ కూడా నచ్చడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడాలి. రవితేజ గారితో పని చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. వామ్మో మంచి మాస్ నెంబర్. చాలా రోజుల తర్వాత చేశాను. తప్పకుండా సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్యు.






