kavitha: బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీ రావాలి : కవిత
కేసీఆర్ను ఉరితీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (kavitha) అన్నారు. శాసన మండలి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందని చెప్పారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చాను. కేసీఆర్ (KCR)పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. కృష్ణా జలాలపై అసెంబ్లీ (Assembly) కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలి. బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలి. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దు. బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారు అని అన్నారు.






