Konaseema: కోనసీమ జిల్లా కలెక్టర్ కు తప్పిన ప్రమాదం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) కలెక్టర్ కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబరాల్లో (Sankranthi celebrations) భాగంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో పడవ (Boat) పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రయల్ రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ (Mahesh Kumar) ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన అదుపుతప్పి కాలువలో పడిపోయారు. వెంటనే అక్కడున్న స్విమ్మర్లు (Swimmers) ఆయన్ను రక్షించి వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






