బాటా కరోవోకె విజయవంతం

బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీన నిర్వహించిన కరోవోకె కార్యక్రమంలో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఈ కరోవోకె కార్యక్రమాన్ని ఆన్‍లైన్‍లోనే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ 19 తరువాత ఆన్‍లైన్‍లో నిర్వహించిన 3వ కార్యక్రమం ఇది. బాటా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), పాఠశాల, మీడియా పార్టనర్ విరిజల్లు తోడ్పాటు అందించింది.
ఈ కార్యక్రమంలో పలువురు తమ పాటల ప్రతిభను ప్రదర్శించారు. షోహిణి, దివ్యకళ, శృతి ఎన్, అనిక ప్రసాద్, స్నిగ్ధ, మానస గాదెపల్లి, విజయ గోపరాజు, దివ్య ఎం, సంజన, గగన్ దీప్, సుచిత్ర, శ్రీధర్ గణపతి, కృష్ణ రాయసం, శ్రీని తగిరిశ, ప్రసాద్ మంగిన, కృత్తిక, మాధవ్ దంతుర్తి, ప్రసాద్ బి, రవి టాటా, ప్రకాష్ కోట్ల, సంజీబ్ గోస్వామి, నవ్య వేమూరి, అశ్విన్, రాజు, శ్రీనివాస్ నల్లాన్, మృదుల జొన్నగడ్డ, అంకిత జగన్, అంకిత, అమృత తుర్లపాటి, జయదేవ్, శ్రీహర్ష, రామకృష్ణ, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాటలు పాడి అందరినీ మెప్పించారు.
బాటా ప్రెసిడెంట్ యశ్వంత్, వైస్ ప్రెసిడెంట్ హరినాథ్, సెక్రటరీ సుమంత్, ట్రెజరర్ కొండల్, జాయింట్ సెక్రటరీ అరుణ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రవి, కామేష్, కళ్యాణ్, శిరీష, అడ్వయిజరీ బోర్డ్ సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి, కల్చరల్ కమిటీ సభ్యులు శ్రీదేవి, శ్రీలు, దీప్తి, నామినేటెడ్ కమిటీ సభ్యులు హరి, వరుణ్, తానా నాయకులు రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోగంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ప్రశంసిస్తూ, ఈ?కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికి అభినందనలు తెలిపారు.