టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఫిక్స్..?
భారత టీ20 క్రికెట్ జట్టు నాయకత్వంలో త్వరలో ఒక సంచలన మార్పు చోటుచేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ (BCCI) గట్టిగా యోచిస్తోంది. గత కొంతకాలంగా ఐపీఎల్లో(IPL) అయ్యర్ చూపించిన అద్భుతమైన నాయకత్వ ప్రతిభే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, ఒక వ్యూహకర్తగా జట్టును విజయపథంలో నడిపించడంలో అయ్యర్ సఫలమవ్వడం సెలెక్టర్లను ఆకర్షించింది.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే అతను ఎందుకు ఈ రేసులో ముందంజలో ఉన్నాడో అర్థమవుతుంది. 2024 ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును మూడవసారి ఛాంపియన్‌గా నిలబెట్టడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్(PBKS) జట్టుకు సారథ్యం వహించి, ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. వరుసగా రెండు సీజన్లలో రెండు వేర్వేరు జట్లను అద్భుతంగా నడిపించిన తీరు అయ్యర్ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచింది.
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్(Shreyas iyer) తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉండటం కూడా అతనికి కలిసి వచ్చే అంశం. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వ్యక్తిగత బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించేలా చేయాలని, భవిష్యత్తులో వచ్చే మెగా టోర్నీల కోసం అయ్యర్ వంటి దీర్ఘకాలిక కెప్టెన్‌ను సిద్ధం చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ మార్పుకు సంబంధించి బీసీసీఐ త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది గనుక జరిగితే, టీమిండియా టీ20 జట్టులో ఒక సరికొత్త శకం మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






