Shivam Dube: శివం దూబే.. ఇలా బౌలింగ్ చేస్తారా..?
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా చెన్నై చేపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ ఏకంగా 256 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, జింబాబ్వే బ్యాటర్లు గట్టిగానే పోరాడారు. ఈ క్రమంలో భారత ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube) బౌలింగ్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు దారితీసింది. అతను వేసిన బంతులు, ఇచ్చిన పరుగులు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రెండు ఓవర్లు.. 18 బంతులు.. 46 పరుగులు!
ఈ మ్యాచ్‌లో దూబే (Shivam Dube) బౌలింగ్ అత్యంత పేలవంగా సాగింది. కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసిన అతను ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఎకానమీ రేటు 23కి పైగా నమోదు కావడం గమనార్హం. 12 బంతులు వేయాల్సిన రెండు ఓవర్లలో నోబాల్స్, వైడ్లతో కలిపి మొత్తంగా 18 బంతులు వేశాడు. అంటే మూడు ఓవర్లు వేసినట్లే. మొదటి ఓవర్లోనే ఏకంగా 10 బంతులు వేసి 26 పరుగులు ఇచ్చాడు. అయినా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమ్మకంతో రెండో ఓవర్ ఇవ్వగా.. అందులోనూ 8 బంతులు వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు దూబే (Shivam Dube). ఒక బంతినైతే ఏకంగా ఆడుతున్న పిచ్‌పై కాకుండా పక్కనున్న పిచ్‌పై వేయడం బ్యాటర్లతో పాటు కామెంటేటర్లను సైతం ఆశ్చర్యపరిచింది.
తప్పిన లైన్ అండ్ లెంగ్త్..
దూబే (Shivam Dube) బౌలింగ్‌లో ఏమాత్రం వైవిధ్యం (వేరియేషన్స్) కనిపించలేదు. పదేపదే ఆఫ్‌సైడ్‌కు దూరంగా వేసే క్రమంలో బంతులు వైడ్‌గా వెళ్లాయి. బ్యాటర్లు సులభంగా పసిగట్టి బౌండరీలు బాదుతున్నా తన లైన్ మార్చుకునే ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు ఫీల్డింగ్‌లోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాడు. తన కళ్ల ముందే బంతి బౌండరీకి వెళ్తున్నా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మాజీల విమర్శలు..
దూబే (Shivam Dube) ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “శివం దూబే (Shivam Dube) నా దృష్టిలో కేవలం బ్యాటర్ మాత్రమే. వికెట్లు తీసే ఉద్దేశం అతడిలో కనిపించడం లేదు. గంటకు 120 కి.మీ వేగంతో బంతులేస్తూ భారీగా పరుగులు ఇచ్చే ఆటగాడిని ఆల్‌రౌండర్ అనలేం” అని మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “గత మూడు మ్యాచ్‌ల్లో 7 ఓవర్లు వేసి 113 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించింది” అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు. “ఆరో బౌలర్ రెండు ఓవర్లలో 46 పరుగులు ఇస్తే జట్టు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు” అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ హెచ్చరించాడు.
ఈ వరల్డ్‌కప్‌లో చావోరేవో తేల్చుకునే దశలో ఉన్న టీమిండియా.. దూబే (Shivam Dube) కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా, బౌలింగ్‌లోనూ లయ అందుకోవాలని, ముఖ్యంగా లైన్ అండ్ లెంగ్త్‌పై దృష్టి సారించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకుంటే నాకౌట్ దశలో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.






