ఆర్సీబీ ప్లేఆఫ్స్ లెక్కలు, నాకౌట్ చేరాలంటే..?
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్ రేసులో ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉంది. రజత్ పాటిదార్(Rajat Patidar) నేతృత్వంలోని ఆర్సీబీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉండగా, ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవడానికి ఆర్సీబీకి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆర్సీబీ తన మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలిస్తే, మొత్తం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
అలా కాకుండా, కనీసం ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి 16 పాయింట్లు పొందినా, గత ఐపీఎల్ రికార్డుల ప్రకారం ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమవుతుంది. అయితే, ఒకవేళ జట్టు ఏది గెలవకపోతే.. 14 పాయింట్ల వద్ద ఆగిపోయి.. అప్పుడు ప్లేఆఫ్స్ అర్హత అనేది ఇతర జట్ల ఫలితాలు మరియు నెట్ రన్ రేట్ (NRR)పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్సీబీ.. ముంబై మీద గెలిచి మంచి జోష్ లో ఉంది. అంతకు ముందు రెండు మ్యాచ్ లలో ఓడిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
మే 13న కోల్కతా నైట్ రైడర్స్ (KKR), మే 17న పంజాబ్ కింగ్స్ (PBKS), మరియు మే 22న సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లతో తలపడాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్లలో జట్టు తిరిగి పుంజుకుని ఇతర జట్ల మీద ఆధారపడకుండా నాకౌట్ దశకు చేరుతుందో లేదో చూడాలి. నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పోరాడి విజయం సాధించింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం గత మూడు మ్యాచ్ ల నుంచి ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి






