Milpitas: మిల్పిటాస్‌లో ఆకట్టుకున్న రామదాసు నవరత్న గోష్టిగానం

మిల్పిటాస్‌లో ఉన్న వేదా టెంపుల్ (Veda Temple) లో జరిగిన రామదాసు నవరత్న గోష్టిగానం (Rama Dasu Navaratna Gosti Ganam) వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు వాగ్గేయకారులు రామదాసు రచించిన కీర్తనలను పాడి వినిపించారు. అలాగే లివర్ మోర్ టెంపుల్ లో కూడా రామదాసు నవరత్న సంకీర్తన జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పలువురు సంగీత కళాకారులు పాల్గొన్నారు. గాయత్రి అవ్వారుగారు కీర్తనలకు వ్యాఖ్యానం చేసి ఆకట్టుకున్నారు. రావు తల్లాప్రగడ ఇతర విద్వాంసులు ఇందులో పాల్గొని గోష్టిగానం చేశారు.