Hyderabad: హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాలు
అమెరికాలోని తెలుగువారికి మీడియా పరంగా సేవలందించేందుకు 2004లో ప్రారంభమైన ‘తెలుగు టైమ్స’ నాటి నుంటి నేటి వరకు విభిన్నమైన కథనాలతో, ఆకట్టుకునే కవర్ స్టోరీలతో ఆదరణను పొందుతోంది. కాలానికి తగ్గట్టుగా పత్రికతోపాటు తెలుగు టైమ్స్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. పోర్టల్‌లో ఎప్పటికప్పుడు ఆంధ్ర, తెలంగాణ వార్తలతో పాటు ప్రత్యేకంగా రాజకీయాలపై ఆర్టికల్సు, సినిమా, ఎన్నారై తెలుగు సంఘాల వార్తలను ప్రచురిస్తూ పాఠకుల్లో అటు ఆన్లైన్, ఇటు ఆఫ్‌లైన్ మీడియాగా పేరు పొందింది. తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్‌కు కూడా మంచి ఆదరణే లభించింది. పోర్టల్‌లో ఎన్నో కథనాలు, విషయాలు, రాజకీయ విశ్లేషణలు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటే, పక్షం రోజుల కోసారి వచ్చే ఇ-పత్రికలో వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు, అమెరికా తెలుగు సంఘాల కార్యక్రమాలు, సినిమా స్టోరీలు ప్రచురితమవుతూ వేలాది మందిని ఆకట్టుకుంటోంది.
ఎన్నో కార్యక్రమాలు…
తెలుగు టైమ్స్ పత్రికాపరంగా న్యూస్‌లను అందిస్తూనే మరోవైపు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకోసం ఎన్నో కార్యక్రమాలను చేసింది. అందులో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇలా ఎన్నో ఉన్నాయి.
అమెరికాలోని తెలుగువారి కోసం మొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి అమెరికాలోని వివిధ నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలు చేసింది. తరువాత అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, విజయవాడ కనకదుర్గమ్మ కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలను కూడా చేసి అందరి ప్రశంసలను అందుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వారు చేసిన అమెరికా పర్యటనలో కీలకపాత్రను పోషించింది. అమెరికాలో జరిగే ఇతర కార్యక్రమా లకు కూడా తెలుగు టైమ్స్ మీడియా పార్టనర్‌గా ఎంతో సహకారాన్ని అందిస్తూ వస్తోంది.
ప్రతి సంవత్సరం మార్చిలో వచ్చే తెలుగు టైమ్స్ వార్షికోత్సవం అంటే మాకు ఒక పండుగలాంటిది. ఎందుకంటే వార్షికోత్సవ సంచిక మిగతా సంచికలకంతా భిన్నంగా ఉండటం ఓ కారణం. ఆ విభిన్నతను చూపేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుంటుంది. పదేళ్లుగా ప్రతి వార్షికోత్సవ సంచికలో ఒక శీర్షికను ప్రచురించడం ఆనవాయితీగా పెట్టుకుంది. ఉదాహరణకు నాలుగు సంవత్సరాలు పరిశీలిస్తే 18వ వార్షికోత్సవ సంచికకి 18 మంది తెలుగు మహిళలను, 19వ వార్షికోత్సవ సంచికలో అమెరికాలోని 19 హిందూ దేవాలయా లను పరిచయం చేసాం. 20వ వార్షికోత్సవ సంచికలో 20 మంది తెలుగు వ్యాపార దిగ్గజాల విషయాలను ప్రచురించాము. 21వ వార్షికోత్సవ విశేష సంచికలో తెలుగు కమ్యూనిటీకి సేవలంది స్తున్న 21 తెలుగు సంఘాలకు చెందిన అధ్యక్షులను పరిచయం చేశాము. తరువాత 22వ వార్షికోత్సవ సంచికలో తెలుగు వాళ్లు నిర్వహిస్తున్న 22 పాపులర్ ఇండియన్ రెస్టారెంట్లను పరిచయం చేశాము.
ప్రస్తుతం 23వ వార్షికోత్సవ విశేష సంచిక కోసం మొదటిసారిగా అమెరికా వెలుపలి శీర్షికను పాఠకులకు అందిస్తున్నాము.
ఈ వార్షికోత్సవ సంచికలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో హై రైజ్ అపార్టుమెంట్లతో పాపులారిటీ సంపాదించు కున్న 23 రియల్ సంస్థల గురించి పరిచయం చేశాము. ఈసారి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రత్యేక కథనం కోసం తీసుకోవడం వెనుక ముఖ్య కారణం ఉంది. హైదరాబాద్ ఇప్పుడు ఎంఎన్సీలకు కేంద్రంగా ఉంది. అలాగే అంతర్జాతీయ సంస్థలకు కూడా వేదికైంది. ఈ సమయంలో ఇక్కడ నివసించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలవారు, విదేశాల్లోని ఎన్నారైలు హైదరాబాద్‌ను స్థిర నివాసంగా మార్చుకుంటున్నారు. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం బాగా పాపులారిటీని సంపాదించుకుంది. దానికితోడు ఇప్పుడు అన్ని సంస్థలు ఆకాశమంత భవనాలను నిర్మించేం దుకు ముందుకు వచ్చాయి. చాలాచోట్ల ఈ హైరైజ్ బిల్డింగ్స్ ప్రారంభమయ్యాయి కూడా. ఓ విధంగా చెప్పాలంటే వెస్ట్ హైదరాబాద్ (గచ్చిబౌలీ, ఫైనాన్సియల్ డిస్టిక్ట్, కోకాపేట్ ఏరియాలు)లోని అత్యాధునిక భవనాలను, సౌకర్యాలను చూసినప్పుడు న్యూయార్క్ డౌన్టౌన్లో ఉన్న బిల్డింగ్లు గుర్తుకు వస్తాయని అంటారు. అందుకే ఈ అంశాన్ని ఈ ప్రత్యేక వార్షికోత్సవ సంచికకు తీసుకున్నాము. ఈ సంచికలో 23 రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటు ఆ కంపెనీ ప్రొఫైల్, ఆ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టులలో ముఖ్యమైన ఓ హైరైజ్ బిల్డింగ్ ప్రాజెక్టు వివరాలను, సంస్థ చైర్మన్ మాటను ప్రచురించడం జరిగింది. అన్ని వార్షికోత్సవ సంచికలను ఆదరించినట్లుగానే ఈ వార్షికోత్సవ సంచికను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
ఈ వార్షికోత్సవ వేళలో తెలుగు టైమ్స్ పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఎప్పుడూ ఆదరించి మద్దతు ఇస్తున్న అడ్వర్టయిజర్లకు ధన్యవాదాలను తెలియజేస్తున్నా ము. ఈ వార్షికోత్సవ సంచికను ఎప్పటిలాగే అందరూ అభిమానిస్తారు అని ఆశిస్తున్నాము.






