Ramky: భద్రత మరియు పర్యావరణ పరిరక్షణలో ఉన్నత ప్రమాణాలను అనుసరించినందుకు గానూ బహుళ అవార్డులను అందుకున్న రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్

పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రముఖ సంస్థ అయిన రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (RIL) రెండు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఆరోగ్యం, భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలలో ఉన్నత ప్రమాణాలకు అనుసరించటంలో రాంకీ నిబద్ధతను ఈ అవార్డులు పునరుద్ఘాటించాయి.
బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ (BSC) మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ల నుంచి అందుకున్న ఈ అవార్డులు , మౌలిక సదుపాయాల అభివృద్ధి కి సంబంధించి అన్ని దశలలో భద్రత-ముందు విధానాలను అమలు చేయడంలో రాంకీ నాయకత్వ ప్రతిభను నొక్కి చెబుతాయి.
బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుండి అంతర్జాతీయ భద్రతా అవార్డు
రాంకీ వన్ ఓరియన్ మరియు రాంకీ వన్ ఆర్బిట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల కోసం బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా అంతర్జాతీయ భద్రతా అవార్డులు 2024ను ఆర్ఐఎల్ అందుకుంది. ఈ అవార్డును బిఎస్సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ మైక్ రాబిన్సన్ ప్రదానం చేశారు. వృత్తిపరమైన ఆరోగ్యం , భద్రత నిర్వహణలో ప్రపంచవ్యాప్త ఉత్తమ పద్ధతులకు కంపెనీ కట్టుబడి ఉందని ఈ అవార్డు గుర్తిస్తుంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) సదరన్ రీజియన్ (ఎస్ఆర్) – ఈహెచ్ఎస్ ఎక్సలెన్స్ అవార్డులు వద్ద కాంస్య అవార్డు
సిఐఐ ఎస్ఆర్ ఈహెచ్ఎస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025లో, ఆర్ఐఎల్ యొక్క రాంకీ వన్ ఆర్బిట్ ప్రాజెక్ట్ పర్యావరణం, ఆరోగ్యం మరియు భద్రతా కార్యక్రమాలలో అత్యుత్తమ పనితీరుకు కాంస్య అవార్డును అందుకుంది. ఈ అవార్డును శ్రీ రాజేష్ మిట్టల్ (ఇసుజు మోటార్స్ ఇండియా అధ్యక్షుడు & ఎండి ), శ్రీ శ్రీనివాసన్ రామభద్రన్ (ఎండి , డిఎస్ఎస్+) మరియు సిమెన్స్ ఎనర్జీ మరియు ఫోర్డ్ ఇండియా నుండి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సహా కీలక పరిశ్రమ నాయకులు ప్రదానం చేశారు.
రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యంచర్ల రత్నాకర నాగరాజా మాట్లాడుతూ “ఈ గుర్తింపులు పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను నిర్మించడానికి , అధిక భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోన్న మా నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఆర్ఐఎల్ వద్ద భద్రత , పర్యావరణ పరిరక్షణ మా కార్యకలాపాలకు పునాది. ఈ విలువలు ఆన్-సైట్ పని నుండి వ్యూహాత్మక నాయకత్వం వరకు ప్రతి నిర్ణయానికి మార్గనిర్దేశం చేస్తాయి. మా శ్రేష్ఠత ప్రమాణాలను స్థిరంగా పెంచే మా బృందాలు, భాగస్వాములు మరియు వాటాదారులకు మేము ఈ అవార్డులను అంకితం చేస్తున్నాము” అని అన్నారు.
తమను గుర్తించి, అవార్డులను అందించిన బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ మరియు సిఐఐలకు హృదయపూర్వక కృతజ్ఞతలను రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తెలియజేస్తోంది. ఆవిష్కరణ, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక ప్రభావం ద్వారా నిర్మాణ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి తమ నిబద్ధతను కొనసాగిస్తోంది.