Ramky: తమ రూ. 3,859.81 కోట్ల ఋణాన్ని పూర్తిగా చెల్లించిన రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్; రుణ రహిత వృద్ధి ప్రయాణం ప్రారంభం

తమ రుణదాతలతో పునర్నిర్మాణ నిష్క్రమణ ఒప్పందాన్ని (ఆర్ఈఏ) విజయవంతంగా అమలు చేసిన అతి కొద్ది భారతీయ కంపెనీలలో ఒకటిగా నిలువడం ద్వారా తమ కార్పొరేట్ ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Ramky Infrastructure Ltd) సాధించింది. ఈ కంపెనీ గతంలో, జూన్ 12, 2015న టర్మ్ లోన్‌లు మరియు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రెండింటినీకలిపి మొత్తం రూ.3,859.81 కోట్ల రుణాన్ని పునర్వ్యవస్థీకరించడానికి పునర్నిర్మాణ ఒప్పందం (ఆర్ఏ)లోకి ప్రవేశించింది. పునర్నిర్మించిన టర్మ్ లోన్‌లను జూన్ 2019 నాటికి పూర్తిగా తిరిగి చెల్లించారు.
తదనంతరం, జూలై 11, 2025న, రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని రుణదాతలు అధికారికంగా ఆర్ఈఏను పూర్తి చేశారు. ఫలితంగా, అన్ని వర్కింగ్ క్యాపిటల్ సౌకర్యాలను ఇప్పుడు రుణదాతలు రెగ్యులర్ మరియు స్టాండర్డ్‌గా వర్గీకరించారు.
ఈ మైలురాయి కంపెనీ యొక్క స్థిరమైన, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తుంది. ఎటువంటి టర్మ్ లోన్లు లేకపోవడం, పునర్నిర్మాణ చట్రం నుండి విజయవంతంగా నిష్క్రమించడంతో, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు దాని బాహ్య క్రెడిట్ రేటింగ్‌లు , అంతర్గత బ్యాంక్ అసెస్‌మెంట్‌లను మెరుగుపరచుకోవడానికి మంచి స్థితిలో ఉంది, తద్వారా దాని మొత్తం ఆర్థిక ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకుంది.
“ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నామని వెల్లడించేందుకు మేము గర్విస్తున్నాము, ఇది మా బృందం యొక్క అచంచలమైన అంకితభావం, మా వాటాదారుల దృఢమైన మద్దతును ప్రతిబింబిస్తుంది” అని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వై.ఆర్. నాగరాజా అన్నారు. ఆయనే మాట్లాడుతూ “ఆర్ఈఏలోకి ప్రవేశించడం మా ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా, వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల మార్కెట్‌లో మా వ్యూహాత్మక లక్ష్యాలను దూకుడుగా కొనసాగించడానికి మాకు తోడ్పాటును అందిస్తుంది. మా వాటాదారులకు మెరుగైన విలువను అందించడానికి , భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నాము. తమ అమూల్యమైన , నిరంతర మద్దతు అందిస్తోన్న మా వాటాదారులు, పెట్టుబడిదారులు, రుణదాతలు, ఆడిటర్లు మరియు ఇతర అంతర్గత, బాహ్య వాటాదారులకు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.